భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిధిలో మయన్మార్-అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో వాయుగుండం ఏర్పడినట్టుగా భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాబోయే 12 గంటల వ్యవధిలో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వాయుగుండం అండమాన్‌లోని మాయాబందర్ ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశగా సుమారు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. రాగల 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరం మధ్య ప్రదేశంలో ఇది తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ తీవ్ర వాయుగుండం నేరుగా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపకపోయినప్పటికీ, దాని ఉపరితల ఆవర్తనం, తేమ గాలుల ప్...