బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం - ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు! ఐఎండీ హెచ్చరికలివే
భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఉత్తర అండమాన్, దానికి ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా, ఆ తరువాతి రోజుకు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ వివరాల ప్రకారం.... బుధవారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమమధ్య - వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారే సూచనలున్నాయి.
ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇవాళ (21-09-2026) రోజున రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా అల్లూరి స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.