భారతదేశం, నవంబర్ 16 -- తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ, దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ తీరం వైపు కదులుతోంది. గడిచిన 6 గంటల్లో ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి 720 కిలోమీటర్లు, విశాఖ పట్నానికి 820 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం... ఈ తీవ్ర వాయుగుండం దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత మంగళవారం (నవంబర్ 17) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుంది. ఆ తదుపరి 48 గంటల్లో ఇది మరింత శక్తివంతమై 'అతి తీవ్ర తుఫాను'గా మారి కోస్తాంధ్ర తీర ప్ర...