బంగాళాఖాతంలో అల్పపీడనం... తుఫాన్ గా మారే ఛాన్స్ - ఈ తేదీల్లో కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..!
భారతదేశం, నవంబర్ 14 -- బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ నవంబర్ 16 సాయంత్రం నాటికి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా ప్రకటించింది. మధ్య అండమాన్ సముద్రం, దాని పరిసర అండమాన్ నికోబార్ దీవులపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం రూపుదిద్దుకుంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 15 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 16 సాయంత్రం కల్లా మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది.
ఈ తుఫాన్ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో నవంబర్ 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత దీని ప్రభావం తూర్పు తీర రాష్ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.