భారతదేశం, జూలై 15 -- బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో రాగల ఐదు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలైన ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలలో ఇవాళ ఉదయం ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది.

దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత బలపడి. బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉంది.

ప్రస్తుతం సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి జమ్మూ, డెహ్రాడూన్, పాట్నా మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉంది. ఏపీ వైపు దిగువ ట్రోపో ఆ...