బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
భారతదేశం, ఆగస్టు 11 -- Andhra Pradesh Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం తీవ్రంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న కొద్దిరోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
మంగళవారం (ఆగస్టు 11) ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడా ఇక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.