భారతదేశం, జూన్ 26 -- ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఆటోమొబైల్ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక జర్మనీలోని నాలుగు ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసివేయాలని భావిస్తోంది. దీనితో పాటు సంస్థలో పనిచేస్తున్న సుమారు లక్ష మంది ఉద్యోగులపై లేఆఫ్స్ వేటు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఇప్పటికే కంపెనీ పర్యవేక్షక మండలి (Supervisory Board) సభ్యులకు చేరవేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనిపై జూలై 9న జరిగే బోర్డు సమావేశంలో అధికారికంగా చర్చించనున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జర్మనీలోని హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్ నగరాల్లో ఉన్న ప్లాంట్లతో పాటు...