భారతదేశం, ఏప్రిల్ 30 -- ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందలేదనే సాకుతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించని కళాశాలలపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విద్యా సంస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదన్న నెపంతో కొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల హాల్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు వచ్చిన వార్తలపై మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం అంగీకారం కాదని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఫీజు బకాయిల కారణంతో పరీక్షలకు దూరం కాకూడదని, ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

నిర్దేశిత అధికారులు లేదా విశ్వవిద్యాలయాల నుండి సరైన గుర్తింపు (A...