భారతదేశం, నవంబర్ 23 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. సెల్‌ఫోన్ దొంగతనం, ఆన్‌లైన్ నగదు బదిలీకి సంబంధించిన వివాదంలో మహిళను కత్తితో పొడిచి హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని బత్తుల పద్మగా పోలీసులు గుర్తించారు. చేవెళ్లలోని ఫరా కళాశాల ఎదురుగా ఉన్న ఒక రేకుల షెడ్డు సమీపంలో ఈ దారుణం జరిగింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన కేతావత్ శివశంకర్ వరప్రసాద్ నాయక్ అలియాస్ శివ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌కు చెందిన శివ.. హత్య తర్వాత పరారయ్యాడు. వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడంతో పాటు, అతని వద్ద నుంచి దొంగిలి...