భారతదేశం, అక్టోబర్ 7 -- రష్యాలో ప్రాణాంతక న్యుమోనిక్ ప్లేగ్ (Pneumonic Plague) వ్యాప్తి చెందుతోందన్న అనుమానాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. రష్యాకు ఎలాంటి ప్రయాణాలు చేయవద్దంటూ అత్యున్నత స్థాయి 'లెవెల్ 4' ప్రయాణ హెచ్చరికను (Do Not Travel Advisory) పునరుద్ఘాటించింది. ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఓ పరిశోధకురాలు మృతి చెందడంతో పాటు స్థానిక ఆసుపత్రులను క్వారంటైన్ చేసినట్లు సమాచారం అందడంతో యూఎస్ ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య హెచ్చరికను విడుదల చేసింది.

ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ ఇన్స్టిట్యూట్‌లో పనిచేస్తున్న పరిశోధకురాలు దారియా షిపిలోవా అక్టోబర్ 1న పరిశోధనల సమయంలో ప్రత్యక్ష బ్యాక్టీరియా సంపర్కంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఆమెతో ప్రాథమిక సంపర్కంలోకి వచ్చిన సుమారు 200 మం...