భారతదేశం, మార్చి 29 -- హైదరాబాద్ జలమండలి అధికారిక లోగోను కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తున్నట్లు ఇటీవల జలమండలి దృష్టికి వచ్చింది. ఈ విధమైన చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమైనవిగా జలమండలి పేర్కొంది. జలమండలి లోగో అనేది సంస్థ ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నం అని తెలిపింది. దీనిని అనుమతి లేకుండా వినియోగించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి లోగోను ఉపయోగించడం వల్ల, ఆ ట్యాంకర్లు ప్రభుత్వ సేవల భాగంగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, మోసపూరిత చర్యగా గుర్తిస్తారని జలమండలి పేర్కొంది.

ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించారు. లోగో దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్ట...