భారతదేశం, ఫిబ్రవరి 3 -- ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టడానికి, ఫేక్ లెక్చరర్లను తగ్గించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లెక్చరర్లకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్ ఐడీ) వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఒక లెక్చరర్ ఏ కాలేజీకి వెళ్లినా ఒకటే శాశ్వత ఐడీ ఉంటుంది. ఇదే ఎక్కడకు వెళ్లినా వారి వివరాలను చెబుతుందన్నమాట.
కొత్త వ్యవస్థ కింద ప్రతి లెక్చరర్‌కు ఒకే శాశ్వత ప్రత్యేక ఐడీని కేటాయిస్తారు. ఒక లెక్చరర్ ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు మారినప్పటికీ అదే ఐడీ కొనసాగుతుంది. ఆధార్ కార్డు ఎలానో.. ఈ ఐడీ కూడా లెక్చరర్లు ఉద్యోగం చేయడానికి ఉపయోగపడనుంది. దీని వలన ఇంటర్ బోర్డు.. లెక్చరర్ పూర్తి సర్వీస్ హిస్టరీని ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
రికార్డులను తారుమారు చేయడం ద్వారా రెండు లేదా మూడు కళాశాలల్లో ఒకేసారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.