భారతదేశం, మార్చి 25 -- రక్తసంబంధాలను మధ్యలో వచ్చిన బంధాల కోసం వదులుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఎన్ని ఘటనలు జరిగినా, ఎంత మంది చెప్పినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కనిపెంచినవారినే బయటివ్యక్తుల కోసం చంపేస్తున్నారు. సికింద్రాబాద్‌లో ఇలాంటి ఘోరమైన ఘటన జరిగింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఒక ఘోరమైన ఘటనలో కుమార్తె తన ప్రియుడి సహాయంతో తల్లిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిన దాదాపు పది నెలల తర్వాత ఈ నేరం వెలుగులోకి వచ్చింది. దీంతో చుట్టుపక్కలవారు.. ఈ ఘటన తెలిసి షాక్ అయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు అంజు (45) కొన్ని నెలల క్రితం అదృశ్యమైంది. తొలుత ఆమె చిన్న కుమార్తె ఇషిక జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నా తల్ల...