భారతదేశం, జూన్ 24 -- పూణేలో ఐదు రోజుల క్రితం జరిగిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (25) మరణం ప్రమాదం కాదు, పక్కా కుట్రతో జరిగిన పకడ్బందీ హత్య అని పోలీసులు తేల్చారు. లోహ్‌గఢ్ కోట వద్ద 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి కేతన్‌ను హతమార్చినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. ఈ దారుణానికి ఒడిగట్టిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)లను పూణే రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోనే అతిపెద్ద వేర్‌హౌస్ డెవలపర్‌ సంస్థల్లో ఒకటైన 'సక్సెస్ గ్రూప్' డైరెక్టర్‌గా కేతన్ అగర్వాల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల ఎఫ్‌డబ్ల్యూ ఓలిన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (బాబ్సన్ కాలేజీ) నుంచి మాస్టర్స్ పూర్తి చేసి 2023లో భారత్ తిరిగొచ్చిన ఆయన, కుటుంబ వ్యాపారంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేనమా...