భారతదేశం, మార్చి 18 -- ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో 'స్ట్రోక్' లేదా 'మస్తిష్క ఘాతం' అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. 25 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. కేవలం ఈ ఏడాదిలోనే సుమారు 1.2 కోట్ల మందికి మొదటిసారి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, అందులో 65 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా.

ఈ నేపథ్యంలో, 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్, స్ట్రోక్ లక్షణాలను సెకన్ల వ్యవధిలో ఎలా గుర్తించాలో వివరిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

మెదడు సక్రమంగా పనిచేయడానికి ఆక్సిజన్, పోషకాలు నిరంతరం అందుతూ ఉండాలి. ఏదైనా కారణం చేత మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయినా లేదా మెద...