భారతదేశం, అక్టోబర్ 21 -- దసరా పండుగ సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణమయ్యే సాధారణ ప్రయాణికుల కోసం దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మరియు విజయవాడ మధ్య పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక 'జనసాధారణ్ స్పెషల్' రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 21, 2026 నుండి అక్టోబర్ 24, 2026 వరకు మొత్తం 4 ట్రైప్‌లు (రోజువారీ సర్వీసులు) నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. పండుగ వేళ రైళ్లలో రద్దీ పెరిగి సాధారణ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రైన్ నంబర్ 07717 (విశాఖపట్నం - విజయవాడ): ఈ రైలు విశాఖపట్నంలో ప్రతిరోజూ ఉదయం 09:40 గంటలకు బయలుదేరి, సాయంత్రం 16:00 (4:00) గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

ట్రైన్ నంబర్ 07718 (విజయవాడ - విశ...