భారతదేశం, అక్టోబర్ 17 -- దసరా పండుగ సీజన్‌లో ప్రయాణికుల తాకిడి పెరగడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు సొంతూర్లకు వెళ్లేవారికి, తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా విజయవాడ - పలాస మార్గంలో ప్రత్యేక జనసాధారణ్ (అన్‌రిజర్వ్‌డ్) రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు విడతల్లో రాకపోకలు సాగిస్తాయి.

విజయవాడ - పలాస మధ్య ఉన్న కీలకమైన స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, నౌపడ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

ఈ రైలు మొత్తం 11 కోచ్‌లతో నడుస్తుంది. ఇందులో 9 జనరల్ క్లాస్ (సాధారణ) కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ సిట్టింగ్ కమ...