భారతదేశం, అక్టోబర్ 14 -- వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే దసరా, దీపావళి పూజా పండుగల సందర్భంగా పెరిగే తీవ్ర ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లను (ట్రెయిన్స్ ఆన్ డిమాండ్) నడుపుతున్నట్లు ప్రకటించింది.

తమిళనాడులోని పోదనూర్ జంక్షన్ నుంచి బీహార్‌లోని బరౌని మధ్య ప్రత్యేక రైళ్లు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైలు సర్వీసులకు సంబంధించి అక్టోబర్ 14న ఉదయం 8.00 గంటల నుంచే దక్షిణ రైల్వే పరిధిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పండుగ సమయంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్, యాప్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఈ రెండు మార్గాల్లోనూ చెరొక సర్వీసును మాత్రమే దక్షిణ రైల్వే నిర...