భారతదేశం, అక్టోబర్ 12 -- Vijayawada Tirupati special Trains : దసరా, దీపావళి పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఈ పండుగ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రత్యేక రైలు సేవలు అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు కొనసాగుతాయి. నాలుగు రోజుల పాటు నడిచే ఈ రైళ్ల ద్వారా ఇరువైపులా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఊరట లభించనుంది.

ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ లిస్టులో పెదవడ్లపూడి, దుగ్గిరాల , తెనాలి, నిడుబ్రోలు , బాపట్ల , చీరాల , చిన్నగంజాం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వ...