భారతదేశం, జూన్ 14 -- సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు.. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఒక ఆధునిక కోచింగ్ టెర్మినల్‌గా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సరికొత్త టెర్మినల్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం, వాహనాల రద్దీని నియంత్రించేందుకు జూన్ 15, 2026 నుండి 'యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్' విధానాన్ని అమలు చేయబోతున్నారు.

రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ కొత్త భవనం(ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు) వద్దకు వచ్చే ప్రయాణికుల పికప్, డ్రాప్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త సౌత్ టెర్మినల్ భవనం (ప్లాట్‌ఫారమ్ నం. 9 వైపు) ప్రయాణికులకు మంచి అనుభూతిని ఇచ్చేలా ఆధునికీకరించారు.

ఇక్కడ విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ...