భారతదేశం, సెప్టెంబర్ 1 -- తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట) ద్వారా ప్రయాణించే భక్తులు, ఇతర ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు కీలక విజ్ఞప్తి చేశారు. పలు ప్రముఖ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసుల వేళల్లో సవరణలు చేసినట్లు విమానాశ్రయ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నూతన టైమ్‌టేబుల్ సెప్టెంబరు 1, 2026 అమలులోకి వస్తుందని వెల్లడించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇండిగో సంస్థకు చెందిన పలు సర్వీసుల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో మార్పులు జరిగాయి.

హైదరాబాద్ - తిరుపతి : ఉదయం 7:20 గంటలకు తిరుపతి చేరుకుని, తిరిగి ఉదయం 8:00 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరుతుంది.

హైదరాబాద్ - తిరుపతి : ఉదయం 11:15 గంటలకు వచ్చి, తిరిగి 11:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంద...