భారతదేశం, జూలై 28 -- విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి, బహిరంగ సభకు వచ్చే ప్రజల రవాణా సౌకర్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,000 బస్సులను భోగాపురం తరలించనున్నారు.

ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి 160 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా భోగాపురం కేటాయించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వి. నీలిమ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికారంగా జూలై 31, 2026 నుండి ఆగస్టు 1, 2026 వరకు (రెండు రోజుల పాటు) ఎన్టీఆర్ జిల్లా పరిధిలో సాధారణ ప్రయాణికులకు కొన్ని బస్సులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ తాత్కాలిక అసౌకర్యాన్న...