భారతదేశం, సెప్టెంబర్ 29 -- పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని న్యూ తిన్‌సుకియా నుంచి బెంగళూరులోని SMVT మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా చెరో 6 సర్వీసుల చొప్పున మొత్తం 12 ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వేలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా బెంగళూరు వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, సింహాచలం నార్త్, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

న్యూ తిన్‌సుకియా - SMVT బెంగళూరు ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (ట్రైన్ నంబర్: 05952) : ...