భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) యంత్రాంగం పలు సంస్థలకు షాకిచ్చింది. ఈ బృందం ముంబైలోని పలు ప్రముఖ ఫుడ్ డెలివరీ అవుట్‌లెట్లు, బేకరీలపై మెరుపు దాడులు నిర్వహించింది. ప్రముఖ ఆన్‌లైన్ బ్రాండ్లు బాక్స్-8 (Box8), మోజో పిజ్జా (Mojo Pizza) మాతృ సంస్థ 'ఈట్‌క్లబ్ బ్రాండ్స్' సహా పలు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది.

ముంబై ఆరే మిల్క్ కాలనీలోని రాయల్ పామ్స్‌లో ఉన్న ఈట్‌క్లబ్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవుట్‌లెట్‌లో ఎఫ్‌డీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం ఇక్కడ తీవ్ర ఉల్లంఘనలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆహార పదార్థాలు, రసాయనాలు, కార్మికుల వ్యక్తిగత వస్తువులను ఒకే చోట నిల్వ ఉంచడం, శుభ్రమైన నీటి వసతి లేకపోవడం, ...