భారతదేశం, ఫిబ్రవరి 27 -- తెలంగాణలోని అన్ని పాఠశాల విద్యార్థులకు 100 శాతం ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ కోసం పాఠశాల విద్యా శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 100 శాతం ఆధార్ నమోదు లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం పాఠశాల పిల్లల ఆధార్ నమోదు 94 శాతంగా ఉంది. మిగిలినది కూడా కంప్లీట్ చేయాలని భావిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని విద్యార్థులకు 100 శాతం ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్స్ సాధించడానికి పాఠశాల విద్యా శాఖ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సమన్వయంతో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్‌పై దృష్టి పెట్టింది

ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 100 శాతం విద్యార్థుల నమోదును నిర్ధారించాలి. సంబ...