భారతదేశం, జూన్ 3 -- ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన 'ఫుడ్ ప్లానెట్ ప్రైజ్-2026' ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం (APCNF)కు లభించడం రాష్ట్రానికే కాక దేశానికీ గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపుతో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, రాష్ట్ర ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి, రైతులు, గ్రామీణ మహిళల అంకితభావంతో కూడిన కృషికి ప్రపంచ వేదికపై లభించిన గౌరవమే ఈ పురస్కారమని మంత్రి వివరించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, గ్రామీణ మహిళలు, ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ...