భారతదేశం, మే 19 -- ప్రపంచం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రాణాంతక ఎబోలా వైరస్ కోరలు చాస్తుంటే.. మరోవైపు అరుదైన హంటావైరస్ కలవరపెడుతోంది. ఈ పరిణామాలు మనం ఎంతటి 'ప్రమాదకరమైన కాలంలో' ఉన్నామో గుర్తుచేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ స్పష్టం చేశారు. జెనీవాలో ప్రారంభమైన డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక సదస్సులో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ మళ్లీ విరుచుకుపడుతోంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీనికి తోడు 'ఎంవీ హోండియస్' అనే క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ కేసులు బయటపడటం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

"యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పులత...