భారతదేశం, జూన్ 8 -- లండన్: విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఇటీవలి విద్యా సంవత్సర ట్రెండ్స్ గమనిస్తే.. ప్రతిభావంతులైన విద్యార్థులంతా స్టెమ్ (STEM- సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సుల వైపు, ప్రధానంగా ఇంజనీరింగ్ పీజీ వైపు అడుగులు వేస్తున్నారు. టెక్నాలజీ అనేది ఇప్పుడు కేవలం ఒక ట్రెండ్ కాదు, రాబోయే తరం భవిష్యత్తును శాసించే దిక్సూచిగా మారింది.

భారతదేశంలో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ అందుబాటులో ఉన్నప్పటికీ, స్థానిక ఉద్యోగ మార్కెట్ అందుకు అనుగుణంగా వృద్ధి చెందడం లేదు. 1,000 కంటే ఎక్కువ కార్పొరేట్ సంస్థల అభిప్రాయాలతో రూపొందించిన 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026' దేశీయ మార్కెట్లోని వాస్తవాలను కళ్లముందుంచింది.

కంపెనీలన్నీ ప్రస్తుతం అనుభవజ్ఞుల...