భారతదేశం, జూన్ 10 -- చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే ఫస్ట్ చేసే పని ఫోన్‌ చూడటం. కానీ అలా చేయకూడదు. ఇక మీదట ఉదయంపూట లేవగానే మొదటగా మీ ఫోన్ చూడటానికి బదులుగా భగవద్గీతలో చెప్పిన ఈ 3 ప్రశ్నలను మీకు మీరు వేసుకోవాలి. ఒకప్పుడు ఉదయం లేవగానే అరచేతులు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్లు చూసే కాలంలో ఉన్నాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉదయాన్నే లేవగానే మొదటగా మనల్ని మనం ఈ 3 ప్రశ్నలు వేసుకోమని చెబుతాడు. ఇవి కేవలం తాత్విక భావనలు కావు. ఏకాగ్రత, స్పష్టత, సార్థకమైన జీవితాన్ని కోరుకునే ఎవరికైనా ఇవి ఆచరణాత్మక సాధనాలుగా ఉపయోగపడతాయి.

ప్రతి ఉదయం చాలా మంది ఫోన్ నోటిఫికేషన్‌లకు త్వరగా చూస్తారు. కానీ ఈ రోజు నేను ఏం చేయాలి? అనే ప్రశ్నను తమను తాము ఎప్పుడూ వేసుకోరు. భగవద్గీత ప్రకారం, బలమైన సంకల్పంతో ప్రారంభించిన పనులు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. మహాభారత యుద్ధానికి మ...