భారతదేశం, మార్చి 14 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, నిరంతరం ఫోన్లతో గడపడం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మనం ఎంతో ఉత్పాదకతతో (Productive) ఉన్నామని భ్రమపడే జీవనశైలే, మనల్ని మృత్యువు దరిదాపుల్లోకి తీసుకెళ్తోందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ భోజరాజ్ హెచ్చరించారు.

రెండు దశాబ్దాలకు పైగా గుండె వైద్య నిపుణుడిగా అనుభవం ఉన్న ఆయన, గుండెపోటు అనేది ఏదో ఒక అనాలోచిత నిర్ణయం వల్ల వచ్చేది కాదని.. అది మనం రోజూ పాటించే ఒక ప్రమాదకరమైన 'రొటీన్' ఫలితమని విశ్లేషించారు. 'నేను చూసే దాదాపు ప్రతి గుండెపోటు కేసు వెనుక ఈ సాధారణ అలవాట్లే ఉంటున్నాయి' అంటూ ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సాధారణంగా మద్యం తాగడం లేదా ధూమపానం వంటి అలవాట్ల వల్లే గుండెపోటు వస్తుందని మనం అనుకుంటాం. కానీ, డాక్టర్ సంజయ్ అభిప్రాయం ప్రకారం, చా...