పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం - గోదావరిలో నీట మునిగి ఐదుగురు మృతి..!
భారతదేశం, జూలై 18 -- Polavaram District : పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఉదంతం జిల్లాలోని ఎటపాక మండలం గొల్లగూడెం గ్రామ సమీపంలో జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం.... గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చేపల వేట కోసం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలోకి దిగారు. అయితే. ఆ ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహ ఉధృతికి వారంతా ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన ఐదు మృతదేహాలను సిబ్బంది బయటకు వెలికితీశారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.