భారతదేశం, నవంబర్ 4 -- మహిళలు, పిల్లలపై జరుగుతున్న అమానుష నేరాలు, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల (FTSC) సంఖ్యను పెంచడంతో పాటు ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2031 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

"మహిళలు, పిల్లలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. నేరాలను అరికట్టేందుకు ఉన్న చట్టాలను పూర్తిస్థాయిలో అమలు ...