పొత్తు ప్రకారమే స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
భారతదేశం, అక్టోబర్ 11 -- అడవి తల్లిబాట 2.0 కార్యక్రమాన్ని పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో 'మాటా-మంతి' కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాకోట గ్రామ సందర్శన సందర్భంగా అక్కడి ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి దాని పునరుద్ధరణకు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.