పొగాకు రైతులకు రూ.50,000 వడ్డీ లేని రుణం.. క్వింటాల్‌పై రూ.1000 సాయం!
భారతదేశం, ఆగస్టు 10 -- ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు ప్రకటించింది. ప్రతి పొగాకు రైతుకు రూ.50,000 చొప్పున సున్నా వడ్డీతో రెండేళ్ల కాలపరిమితికి రుణం అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. దీనితో పాటు ప్రభుత్వం తరఫున క్వింటాల్ పొగాకుపై రూ.1,000 అదనపు సాయం అందజేస్తామని, పంట విక్రయించిన 9 రోజుల్లోనే డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో సోమవారం నాడు పంట కొనుగోళ్లు, మద్దతు ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామితో పాటు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.