భారతదేశం, మార్చి 25 -- ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా బుకింగ్ లు చేస్తున్నారని తెలిపారు. పైప్డ్ గ్యాస్ కొత్త పాలసీ తీసుకువచ్చేలా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని గుర్తుచేశారు.

రెస్టరెంట్లు, విద్యాసంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....