పే డే లోన్స్ అంటే ఏమిటి? వడ్డీ, అర్హతలు, రిస్కుల పూర్తి వివరాలు ఇవిగో
భారతదేశం, అక్టోబర్ 4 -- నెల చివరిలో అకస్మాత్తుగా నగదు కొరత ఏర్పడినా, అత్యవసర వైద్య లేదా ఇతర ఖర్చులు ముంచుకొచ్చినా చాలామంది ఆలోచించే మార్గం 'పేడే లోన్'. ఇవి స్వల్పకాలిక, అన్‌సెక్యూర్డ్ రుణాలు. ఒక జీతం పడిన రోజు నుంచి తదుపరి జీతం వచ్చే వరకు అయ్యే అత్యవసర ఖర్చుల కోసం వీటిని అందిస్తుంటారు. సాధారణంగా రెండు వారాల నుంచి నెల రోజులలోపు లేదా తదుపరి జీతం రాగానే ఈ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాల కోసం ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తుల వంటి ఎలాంటి భౌతిక గ్యారంటీ (కొలేటరల్) సమర్పించాల్సిన అవసరం లేదు.
భారతదేశంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే పేడే రుణాలను అందించేందుకు అనుమతి ఉంది. నేరుగా లేదా అధికారిక లెండింగ్ సర్వీస్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.