భారతదేశం, నవంబర్ 24 -- Jasmin Bhasin Slams Plastic Surgery Trolling: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ఆహార్యంపై నెటిజన్లు భూతద్దం పెట్టి మరీ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. హిందీ బుల్లితెర సీరియల్స్, బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన నటి జాస్మిన్ భాసిన్ తాజాగా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నారు.

కోల్‌కతాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో జాస్మిన్ భాసిన్ దిగిన ఫోటోలు బయటకు రాగానే, ఆమె ముఖం మారిపోయిందంటూ కొందరు నెటిజన్లు పనిగట్టుకుని ప్రచారం మొదలుపెట్టారు. ఆమె బొటాక్స్, ఫిల్లర్స్, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ కామెంట్లు పెట్టడంతో జాస్మిన్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల రాఘవ్ శర్మ సోదరుడి వివాహ వేడుకలకు జాస్మిన్ హాజరయ్యారు. గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోయిన ఆమె, తన ప్రియుడు అలీ గోనీతో పాటు బిగ్ బాస్ విజేతలు మున...