భారతదేశం, జూన్ 16 -- Mithun Chakraborty Daughter Dishani Wedding: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో త్వరలోనే పెళ్లి వేడుకలు జరగనున్నాయి. మిథున్ చక్రవర్తి దత్తపుత్రిక దిషాని చక్రవర్తి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. తన ప్రియుడు మైల్స్ మంట్జారిస్‌తో కలిసి దిషాని సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.

సముద్రపు ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన కొండపై మైల్స్ ఎంతో రోమాంటిక్‌గా దిషానికి ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడుగుతున్న ఫోటోలను ఈ మైల్స్-దిషాని జంట ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఈ వేడుక కోసం మైల్స్ ఆ ప్రపోజల్ స్పాట్‌ను బ్లాక్ అండ్ వైట్ కార్పెట్, కొవ్వొత్తులు, రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించాడు. దిషాని చేతికి ఉంగరం తొడిగి, నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్...