భారతదేశం, జూన్ 30 -- చిన్న తలనొప్పి వచ్చినా, కాస్త ఒళ్లు నొప్పులుగా అనిపించినా వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి పెయిన్ కిల్లర్స్ కొని వేసుకోవడం ఈ రోజుల్లో చాలామందికి అలవాటుగా మారింది. పీరియడ్స్ పెయిన్, కీళ్ల నొప్పులు, జ్వరం వంటి వాటికి కూడా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే నొప్పుల బిళ్లలు వాడుతుంటారు. అప్పుడప్పుడు, సరైన మోతాదులో వాడితే ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ, వైద్యుల సంప్రదింపులు లేకుండా వీటిని తరచూ లేదా దీర్ఘకాలం పాటు వాడితే ప్రాణాలకే ప్రమాదం.

మన శరీరంలోని జీర్ణవ్యవస్థ, కిడ్నీలు, కాలేయం, గుండె వంటి కీలక అవయవాలపై ఈ మాత్రలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలామందికి ఈ మందుల వల్ల జరిగే అంతర్గత నష్టం గురించి కనీస అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో, పెయిన్ కిల్లర్స్ మింగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత...