పెన్షనర్లకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఇంట్లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్
భారతదేశం, అక్టోబర్ 29 -- దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తమ పెన్షనర్లకు అత్యంత ఉపశమనం కలిగించే వార్తను అందించింది. పెన్షన్ పొందడానికి ఏటా దాఖలు చేయాల్సిన లైఫ్ సర్టిఫికేట్(జీవిత ధృవీకరణ పత్రాలు) ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారం 5.0ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు తమ పరిధి అంతటా ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ డిజిటల్ సౌకర్యం ద్వారా పెన్షనర్లు, ముఖ్యంగా వయోవృద్ధులు, ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు వెళ్లలేని వారు బ్యాంకులు లేదా పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ ఇంట్లో నుంచే స్మార్ట్ఫోన్ ద్వారా సర్టిఫికేట్ సమర్పించవచ్చు.
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్, ముఖ గుర్తింపు ద్వారా లైఫ్ సర్టిఫికేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.