భారతదేశం, నవంబర్ 6 -- బెంగళూరు: దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం ద్వారా ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఈ20 (పెట్రోల్‌లో 20% ఇథనాల్) ప్రమాణాలను నిర్దేశించింది. అయితే, క్షేత్రస్థాయిలో చమురు సంస్థలు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సేకరించిన పెట్రోల్ శాంపిళ్లలో ఇథనాల్ శాతం ఏకంగా 31.2 శాతానికి చేరిందని, ఇది వాహనదారులను నిలువునా ముంచడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంపై తక్షణమే వివరణ ఇవ్వాలని, బాధ్యులైన చమురు సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నగరంతో పాటు కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జి...