భారతదేశం, అక్టోబర్ 3 -- ట్రాఫిక్ చలానాలను తేలిగ్గా తీసుకునే వాహనదారులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బకాయి ఉన్న ఈ-చలానాలను చెల్లించకపోతే వాహనాలకు సంబంధించిన పలు డిజిటల్, ఆన్‌లైన్ సేవలను తక్షణమే స్తంభింపజేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పెండింగ్ చలానాలు ఉన్న వాహనాలను కేంద్ర ప్రభుత్వ 'పరివాహన్' పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, వాటికి సంబంధించి ఎలాంటి సేవలు అందించకూడదని స్పష్టం చేసింది.

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు భద్రతపై దాదాపు 14 ఏళ్లుగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

"కేవలం వేలల్లో, లక్షల్లో ఈ-చలానాలను జారీ చేస్తే సరిపోదు. ఆ జరిమానాలను అధికారులు వసూలు చేయలేకపోతే ఈ వ్యవస...