భారతదేశం, జూలై 15 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పులతో పాటు నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాజుగా పిలిచే సూర్య భగవానుడు జూలై 20వ తేదీన కీలకమైన నక్షత్ర మార్పు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న నక్షత్ర స్థానం నుంచి శని దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్య నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించనున్నారు. సూర్యుడు ఇలా రాశి లేదా నక్షత్రాన్ని మార్చిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పు కొందరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తే, మరికొందరు కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉండేవారికి కెరీర్...