భారతదేశం, మే 8 -- ముంబైలోని పైధోని ప్రాంతంలో గత నెలలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి కేసు ఇప్పుడు పోలీసులను విస్మయానికి గురి చేస్తోంది. తొలుత ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ అని అందరూ భావించినప్పటికీ, తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆ కుటుంబం ప్రాణాలు తీసింది కేవలం ఆహార లోపం కాదు, వారు తిన్న పుచ్చకాయలో కలిసిన 'జింక్ ఫాస్ఫైడ్' అనే ఎలుకల మందు అని తేలింది.
ఇస్మాయిల్ కుర్తే రోడ్లోని ఘరీ మొహల్లాలో నివసించే అబ్దుల్లా డొకాడియా (44) కుటుంబం, ఏప్రిల్ 25 రాత్రి తమ బంధువులకు విందు ఇచ్చారు. రాత్రి 11:30 గంటలకు బంధువులంతా వెళ్ళిపోయిన తర్వాత, అబ్దుల్లా తన భార్య నస్రిన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13)తో కలిసి ఇంట్లో ఉన్న పుచ్చకాయను కోసి తిన్నారు. తెల్లవారుజామున 1 గంట సమయంలో పుచ్చకాయ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.