పీఎఫ్ చందాదారులకు బంపర్ ఆఫర్: ఇకపై ఆటోమేటిక్‌గా ఫైనల్ సెటిల్మెంట్.. అప్లై చేయగానే బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు
భారతదేశం, మే 15 -- ప్రభుత్వ రంగ సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సేవలను మరింత వేగవంతం చేసే దిశగా కీలక అడుగు వేసింది. ఇప్పటివరకు కేవలం అడ్వాన్స్ క్లెయిమ్‌లకు మాత్రమే పరిమితమైన 'ఆటో-సెటిల్మెంట్' సదుపాయాన్ని, ఇకపై తుది సెటిల్మెంట్లకు (Final Withdrawals) కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. దీనివల్ల 7 కోట్ల మందికి పైగా ఉన్న చందాదారులకు పేపర్‌లెస్, పారదర్శకమైన సేవలు అందనున్నాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగం మానేసినప్పుడు ఎదురయ్యే జాప్యానికి ఈ నిర్ణయంతో చెక్ పడనుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. కేవలం Rs.5 లక్షల లోపు ఉన్న అడ్వాన్స్ క్లెయిమ్‌లను మాత్రమే కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేస్తోంది. ఇలాంటి క్లెయిమ్‌లలో దాదాపు 70 శాతాన్ని కేవలం 72 గంటల్లోనే (3 రోజులు) ఈపీఎఫ్ఓ పరిష్కరిస్తోం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.