భారతదేశం, ఆగస్టు 12 -- హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా చేపడుతున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణంలో దాదాపు రూ.1700 కోట్ల విలువైన ఏడెకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీలకు కట్టబెడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీవ్రంగా ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ధర సుమారు రూ. 250 కోట్లు ఉంటే, అక్కడ ఉన్న ఏడెకరాల స్థలాన్ని టెండర్లు, అగ్రిమెంట్లు లేకుండా వంశీరామ్, అపర్ణ బిల్డర్స్‌కు రేవంత్...