భారతదేశం, జూన్ 10 -- భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. బుధవారం (10 జూన్, 2026) నాటికి ఆయన ప్రధాని పీఠంపై వరుసగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రధానికి సాధ్యం కాని రీతిలో, సుదీర్ఘ కాలం పాటు ఒకే ఒక్క రోజు కూడా విరామం లేకుండా దేశాన్ని నడిపించిన నేతగా మోదీ ఘనత సాధించారు.

ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వానికి నేతృత్వం వహించిన నెహ్రూ.. వరుసగా 4,398 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు మోదీ ఆ మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. ...