భారతదేశం, సెప్టెంబర్ 25 -- మార్కెట్లో లభించే కృత్రిమ లేదా ప్రత్యామ్నాయ పనీర్ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తులు కాకుండా వంట నూనెలు, పిండి పదార్థాలతో తయారుచేసే 'అనలాగ్ పనీర్'ను ఇకపై 'పనీర్' అనే పేరుతో విక్రయించకూడదని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాల (అమ్మకాల నిషేధం, నియంత్రణ) నిబంధనలు - 2011కు సవరణలు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

పనీర్ అనగానే స్వచ్ఛమైన పాలు, వాటిలోని వెన్న, ప్రొటీన్లతో తయారు చేసే ఆహార పదార్థం గుర్తుకొస్తుంది. అయితే, అనలాగ్ పనీర్‌లో ఎలాంటి పాల ఉత్పత్తులను వాడరు. పాల కొవ్వులు, ప్రొటీన్ల స్థానంలో కూరగాయల నూనెలు (వెజిటబుల్ ఆయిల్స్), పిండి (స్టార్చ్), ప్లాంట్ ప్రొటీన్లు, ఎమల్సిఫైయర్లు, ఇతర రసాయన...