భారతదేశం, ఏప్రిల్ 17 -- స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైతే కారణాలు అన్వేషించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

క్యాంపు కార్యాలయంలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఈ ఏడాది మార్చి 31 వరకు రూపొందించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ర్యాంకులను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు జిల్లాలు స్వచ్ఛాంధ్రలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా... శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, ఏఎస్ఆర్ జిల్లాలు చివరి మూడు స్థానాల్లో ఉన్నట్టు తెలిపారు. ఇందులో విశాఖ జిల్లాకు 92 శాతం, విజయనగరం, గుంటూరు జిల్లాలకు 85 శాతం మార్కులు వచ్చాయన్...