భారతదేశం, మే 18 -- Green vs Yellow Lemon : భారతీయ ఇళ్లలో నిమ్మకాయ లేని వంటగదిని ఊహించలేము. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు నిమ్మకాయల వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం నిమ్మరసం తాగడం అందరికీ అలవాటే. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

నిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. పొటాషియం, విటమిన్ బి6, సిట్రిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలకు నిమ్మకాయ నిలయం. మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొందరు పసుపు రంగు నిమ్మకాయలను, మరికొందరు ఆకుపచ్చ నిమ్మకాయలను కొనుగోలు చేస్తుంటారు. వీటి మధ్య అసలు తేడాలేంటో చాలామందికి తెలియదు.

కొవ్వు తగ్గడం, పీసీఒఎస్ (PCOS) నివారణ అంశాలపై పనిచేసే ప్రముఖ పోషకాహార నిపుణురాలు దిశా పన్వార్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగ...